ఇటిక్యాల పాఠశాలకు

Itikyala School
Itikyala School

10 కుర్చీలు మరియు సౌండ్ బాక్స్ అoదజేత
సిరి న్యూస్ జనవరి 25 మెదక్ రూరల్[Medak rural]
25-01-2025 న గణతంత్ర దినోత్సవం సందర్భంగాం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా ప్రాధమికోన్నత పాఠశాల ఆర్ ఇటిక్యాల పాఠశాలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇలిటెం ఈశ్వరప్ప 10 కుర్చీలను అందించడు జరిగింది . అంతే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులలో చాకలి లక్ష్మణ్ సౌండ్.బాక్స్ , ఉప్పరి బాల్ రాజ్ గారు విద్యార్థులకు టై, బెల్ట్లు అందించడం జరిగింది విద్యార్థులందరికి టై, బెల్టులు అలంకరించి, ఉప్పరి బాల్ రాజ్ గారిని గ్రామస్థులు అభినందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం గ్రామస్థులందరూ ముందుకు రావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు D.శ్రీనివాస్ కోరారు. నేటి బాలలే రేపటి పౌరులు కావున విద్యార్థులందరూ గొప్పగా చదువుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు సంధ్యా మేడం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సంధ్య, శ్రీవాణి, వెంకటేశం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పంచాంరుతి సెక్రెటరీ సోమేశ్వర్ పాల్గొన్నారు.