నూతన అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభం
నారాయణఖేడ్[narayankhad] జనవరి 24 సిరి న్యూస్
నాగల్ గిద్దా మండల పరిధిలోని మోర్గి గేట్ వద్ద నూతన అవుట్ పోస్ట్ నాగల్ గిద్డ పోలీస్ స్టేషన్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రూపేష్, అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పోలీస్ స్టేషన్ వలన కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వేరే మండలాలలో కూడా పోలీస్ స్టేషన్ భవనాలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడైతే ప్రభుత్వ సొంత భవనాలు లేఒ అక్కడ కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపి నిర్మించే విధంగా చూస్తామన్నారు. నాగల్ గిద్ద మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేద్దామని మోర్గి గ్రామ శివారులో గత కొద్దిరోజులు యిక్కడికి ఆర్డీవో తో కలిసి భూమిని పరిశీలించడం జరిగింది. తప్పకుండా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి అనేక మంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తాం అని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు నారాయణఖేడ్ సిఐ మండలాల ఎస్ ఐ నగల్ గీద్ధ మండల ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.