అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Indiramma houses for the deserving poor
Indiramma houses for the deserving poor

ఎంపిక బాధ్యత రెవెన్యూ అధికారులదే
గ్రామాలలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేట్లు చూడాలి
ఫిర్యాదులు రాకుండా గ్రామ సభల్లో చర్చించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
తహసిల్దార్ లు, ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష.

సంగారెడ్డి, జనవరి 7 సిరి న్యూస్
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూఅధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చిన దరఖాస్తులను వ్యక్తిగతవిచారణ జరిపి,గ్రామసభలలో చర్చించిలబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు.మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్డీవోలు తహసిల్దార్లు ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలతో, జిల్లాలో ఎక్కడ కూడా ఇండ్లు ఉన్న లబ్ధిదారులు ఇచ్చారు, లేని వారికి ఇవ్వలేదు, అన్న ఫిర్యాదు రాకుండా అధికారులు
పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ అధికారుల విచారణ అనంతరం గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిర మహిళలకు లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో పెండింగ్ ఉన్న వాటిని, గ్రామాల్లో లేని వారిని గ్రామాలకు పిలిపించి వారి వివరాలు సేకరించి సర్వే పూర్తయి ఎలా అధికారులు చూడాలని అన్నారు.జిల్లాలోని కొల్లూరు ,తెల్లాపూర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అంగన్వాడి కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసేలా జిల్లా వైద్యాధికారి, జిల్లా విద్యాధికారి, డిడబ్ల్యువోలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు లబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇండ్ల కింద బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కొల్లూరు తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సొసైటీల ఏర్పాటు కోసం సహకార శాఖ అధికారులతో చర్యలు చేపట్టాలని అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లు లబ్ధిదారులకు అందజేసేలా అధికారులు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు . డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్,హౌసింగ్ పీడీ. చలపతి, మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, కాంట్రాక్టులు, తదితరులు పాల్గొన్నారు.