
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణ.
సిరి న్యూస్ అందోల్[andole] : అందోల్ రేషన్ కార్డులో, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
8వార్డ్ లో మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాచకొండ ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేదలకు, రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి చేరే విధంగా క్షేత్రస్థాయిలో సర్వే పరిశీలించి. ఏమన్నా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సూచించాలని వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలును. అమలు చేయడం కోసం సర్వే పరిశీలన. వేగవంతం చేసి ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని రేషన్ కార్డులు జారీ ఇందిరమ్మ ఇల్లు నిరంతరం ప్రక్రియ అని ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విషయాన్ని విస్తృతంగా ప్రచారాన్ని గావించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరికరంలోనికి తీసుకొని పరిశీలించాలి. కూలి పని చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి
గ్రామంలోని పెద్దలు,
మరియు , మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, రాములు,ప్రణవి,
RP రొయ్యల అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు , రాచకొండ శివ ప్రసాద్ గౌడ్, కౌన్సిలర్ భవాని నాగరత్నం గౌడ్ ,బండల సంతోష్ , ఎండి షేఖిల్, కోట నరేష్, తదితరులు పాల్గొన్నారు.