సంగారెడ్డి టౌన్, [sangareddy] జనవరి 15 ( సిరి న్యూస్ )
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీమణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో ఏనుగు అంబారిపై అయ్యప్పస్వామి స్వర్ణాభరణాలు ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంజీవనగర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును జ్యోతిర్వాస్తు విద్యాపీఠం డాక్టర్ మహేశ్వరశర్మ సిద్ధాంతి ప్రారంభించారు. పాతబస్టాండ్ శ్రీ నవరత్నాలయ దేవస్థానం వరకు కేరళ వాయిద్యాలు, మహిళల కోలాటం, అయ్యప్ప స్వాముల ఆటపాటలతో వైభవంగా జరిగిన ఊరేగింపు మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి విశ్వనాధరావు, శ్రీశైలం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు మాణిక్య రెడ్డి, నరేష్ కుమార్ గురుస్వాములు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు సంగారెడ్డిలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో.. ఏనుగు అంబారిపై స్వర్ణాభరణాల ఊరేగింపు