దొంగను ఎక్కడైనా న్యాయవాదితో విచారణ చేస్తారా..
మాజీ మంత్రి కేటీఆర్‌కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూటి ప్రశ్న
జెండా ఊపి 108 వాహనాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపీ.
మనోహరాబాద్. జనవరి 7 సిరి న్యూస్ః
ఎలాంటి తప్పు చేయని నీకు ఏసీబీ, ఈడి కేసులకు భయమెందుకు వచ్చిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. లొట్ట పీసు కేసులకు భయపడనంటివి, వారి నోటీసులకు భయం పుట్టుకొచ్చిందా అని మండిపడ్డారు. దొంగలను ఎక్కడైనా న్యాయవాదుల సమక్షంలో పోలీసులు విచారణ జరుపుతారా అని కేటీఆర్ ను నిలదీశారు. హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టివేస్తే జ్వరం పుట్టుకొచ్చిందా కేటీఆర్ అని మండిపడ్డారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన 108 అంబులెన్స్ వాహనాన్ని రాష్ట్ర బిజెపి నాయకుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, టిఆర్ఎస్ నాయకుడు పురం రవికుమార్ ముదిరాజ్, డాక్టర్లు, వైద్య సిబ్బందితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు, సామాన్యులకు అందుతున్న వైద్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తు దేవుళ్ళతో సమానమైన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ అందించి ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పోలీసులంటే గౌరవం లేదా, మీ పదేళ్ల పరిపాలనలో పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చిన నీవు అధికారం కోల్పోగానే పోలీసుల పనితీరుపై తప్పు పట్టడం సరికాదని గుర్తు చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అజయ్ కుమార్, డాక్టర్లు జోష్నా, సమత, హోమియో డాక్టర్ వైష్ణవి, సి హెచ్ ఓ బాలనర్సయ్య, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటోలు.
జెండా ఊపి 108 వాహనాన్ని ప్రారంభిస్తున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
వైద్యులతో మాట్లాడుతున్న దృశ్యం