జాగ్రత్తలు తప్పక పాటించండి
డీల్ …కీంచ్ ….పెంచ్ …కట్… పతంగ్… ఫట్ వంటి మాటలతో దద్దరిల్లిపోతుంది
(ఇందిరా రాకేష్ )
సిరి న్యూస్ /గుమ్మడిదల
ఆకాశంలో తారల్లా ఎగిరే గాలిపటాలను చూసి మురిసిపోని వారు ఎవరైనా ఉంటారా! పతంగిని ఎగురవేసేవారు ఎవరైనా తన గాలిపటమే ఎత్తులో ఎగరాలనుకునే చిన్నారులు ఉంటారు. పతంగులను ఎగురవేసే సమయంలో ఎక్కడ నుండి పడితే అక్కడ ఎగరవేస్తారు కానీ ఎంతటి ప్రమాదం జరుగుతుందో అన్న విషయాన్ని మర్చిపోతారు కాబట్టి అలాంటి సమయంలో పిల్లల చెంతనే పెద్దలు ఉండడం కానీ ప్రమాదం జరిగే తీరును వారికి వివరించడం ఎంతో ఉత్తమం. డీల్ …కీంచ్ ….పెంచ్ …కట్… పతంగ్… ఫట్ వంటి మాటలతో దద్దరిల్లాల్సిందే ఆ జోరుల్లో ఆకాశమే వారి విల్లుగా మారుతుంది. గాలిపటాలను చూస్తూ ముందుకెళ్తే ప్రమాదం బారిన పడవచ్చు. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంక్రాంతి పండుగ
తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలు ఎంతో ముఖ్యమైనది పవిత్రమైనది అందరికీ ఆనందదాయకమైనది సంక్రాంతి పండుగ. గ్రామీణ పల్లె ప్రాంతాలలో ఈ పండుగను ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా రైతులు తాము పండించిన పంటలు చేతికి వచ్చాక వచ్చే పండుగ కనుక రైతులు దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు గుమ్మడిదల పారిశ్రామికవాడ ప్రాంతంలో తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల ఈ పండుగను భారీ ఎత్తున మూడు రోజులు పాటు జరుపుకుంటున్నారు ఈ పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెలుగువారింట్లో ఎంతో సంతోషం ఆర్భాటం కనిపిస్తుంది తెల్లవారుజామునే లేచి ఇండ్ల ముందు ముంగిట్లో కల్లాపి చల్లి సంక్రాంతి పండుగకు సంబంధించిన ముగ్గులను వేసి వాకిళ్ళను అందంగా అలంకరిస్తారు. ఖరీఫ్ లో వేసిన పంటలన్నీ బాగా పడటంతో దాన్యమంతా ఇళ్లలోకి చేరడంతో సందడిగా కనిపిస్తుంది. అదే ఆనందంతో పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు ఈ పండుగ మొదటిరోజు భోగి పండుగ రెండవ రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ పండుగ జరుపుకుంటారు.
మూడు రోజులు ఏం చేస్తారు
సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఆరోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా జరుపుకుంటారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటారు ఆ మంటల్లో రైతుల కష్టాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పండ్లను వేసుకుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి పండుగ. పండించిన పంట అంతా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా ఇంటికి చేరిందని ఆనందంగా లక్ష్మీదేవిని పూజిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ రోజు ఎక్కువ సందడి కనిపిస్తుంది మూడవరోజు కనుమ పండుగ. తన వ్యవసాయ పనిముట్లను అలంకరించుకొని పూజించే సంప్రదాయం అనాదిగా వస్తుంది నిరంతరం శ్రమిస్తూ సాయం అందించే పశువులను శుభ్రపరచి అలంకరించుకుంటారు మహిళలు మూడు రోజులపాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేస్తారు ఇలా ఆచార సంప్రదాయాలతో మూడు రోజుల పండుగలు జరుపుకుంటారు
గాలిపటాల పోటీలో నిమగ్నమైన పిల్లలు చిన్న పెద్ద అని తేడా లేకుండా గాలిపటాలను ఎగురవేయడం జరుగుతుంది. పోటాపోటీన ఎగురవేసిన పతంగులను ఒకదానికొకటి పోటీ చేసి తెంపి వేయడంతో తహతహలంతో ఉత్సాహంగా ఉంటున్నారు విద్యార్థులకు పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లలంతా గాలిపటాలను ఎగరవేయడంలో నిమగ్నమైనారు రంగురంగుల గాలిపటాలతో పాటు మాంజాలతో పోటీ పడటం జరుగుతుంది పతంగులు తెగిపోయిన వెంటనే అల్లరితో ఆనందంలో మురిసిపోతున్నారుఈ జాగ్రత్తలు పాటించండిపతంగులను ఎగురవేసే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే తన ప్రాణానికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.విద్యుత్ స్తంభాలు తీగలు , ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో గాలిపటాలను ఎగురవేయవద్దు.
బహిరంగ ప్రదేశాల్లోనే పతంగులను ఎగురవేయాలి
వీలైనంతవరకు ఇరుకైన వీధుల్లో గాలిపటాలను ఎగురవేయొద్దుపిల్లలే కాదు పెద్దలు కూడా విద్యుత్ తీగల మీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నించవద్దు వాటికి దారాలను గట్టిగా లాగొద్దు ఇలాంటి వాటిని తీసేందుకు ఊచలను ఏమాత్రం ఉపయోగించకూడదు తడిసి ఉన్న కర్రలను వాడకూడదు అలా చేస్తే విద్యుత్ ఘాతానికి గురవే ప్రమాదం ఉంది.భవనాలపై నుంచి సగం నిర్మించిన గోడల మీద నిలబడి గాలిపటాలను ఎగురవేస్తే విద్యుత్ ఘాతాలే కాదు హడావిడి కింద పడిపోయే ప్రమాదం ఉంది
కొంతమంది పిల్లలు గాలిపటం కింద పడగానే రోడ్లపై వాహనాలను లెక్కచేయకుండా వాటిని కైవసం చేసుకునేందుకు పరుగులు తీస్తారు ఎట్టి పరిస్థితులను అలాంటి ప్రయత్నాలు చేయవద్దుప్రమాదం జరిగితే సమాచారం అందించండి సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ఏదైనా ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనాలకు సమాచారం అందించండి విద్యుత్ ప్రమాదం లాంటివి ఏవైనా జరిగితే విద్యుత్ అధికారులకు తగిన సమాచారం వెంటనే ఇవ్వండి.