
మాసాయిపేట్[Masaipet] సిరి న్యూస్ ఫిబ్రవరి 3:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే హలో మాదిగ చలో హైదరాబాద్ లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి పిలుపునిచ్చారు. మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుందనిఅన్నారు. ఈనెల 7వ తేదీన నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మాసాయిపేట యాదగిరి మాదిగ, ముక్క వినోద్ మాదిగ, శరత్ మాదిగ, నరేష్ మాదిగ, శివశంకర్ మాదిగ,ఆంజనేయులు మాదిగ,తదితరులు పాల్గొన్నారు.