పిల్లలకు గాలిపటాలు పంపిణీ
సిరి న్యూస్ సిద్ధిపేట
భోగ భాగ్యాల భోగి.. సుఖ సంతోషాల సంక్రాంతి.. కమ్మని వంటల కనుమ.. కలబోసి అందరి ఇంట ఆనందం వెల్లివిరియాలని బైరి గిరీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక మకర సంక్రాంతి‘ అని పేర్కొన్నారు. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అనంతరం పిల్లలకు గాలిపటాలు పంచి చైనా మంజ వాడకుండా ఉండాలని చెప్పి పిల్లలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.\