తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న యువకుడు కుమార్ సాగర్..
ఓవైపు వ్యవసాయం, మరోవైపు రాజకీయాలతో పాటు, న్యాయవాద వృత్తి..
రామయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన కుమార్ సాగర్ పై సిరి న్యూస్ ప్రత్యేక కథనం..
రామాయంపేట ఫిబ్రవరి 2 (సిరి న్యూస్)
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది తర్వాత కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ఒక్కొక్కరిది ఒక్క కారణం. కానీ అందుకు భిన్నంగా ఆ యువకుడు 2009 తెలంగాణ ఉద్యమం నుండి 2014 రాష్ట్రం వచ్చేవరకు అలుపెరుగని పోరాటం చేసి విద్యార్థి సంఘాలతో పాటు, రాజకీయ సంఘ నాయకులకు అందరి మన్ననలుపొందిన వ్యక్తి. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన రాజకీయ అనుభవాలు గుర్తుంచుకొని ఇప్పటికైనా రాజకీయంగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో నేటి వరకు ప్రజా ఉద్యమంలో ముందుంటున్నాడు.
సిరి.1) మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?
2009 సంవత్సరం నుండి 2014 తెలంగాణ వచ్చేవరకు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
సిరి2) ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేశారా?
గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు ఓట్ల తేడాతో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థి పై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది.
సిరి3) ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీకి ప్రజలు ఏలాంటి ఆదరణ ఉంది?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది.
సిరి4) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారా?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
సిరి 5) ఉద్యమకారుడిగా ఉన్న మంచి గుర్తింపు ఇప్పుడు కొనసాగుతుందా?
ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు మెదక్ ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం జేఏసీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఓయూ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి,రాజారాం యాదవ్ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి పని చేయడం జరిగింది.
సిరి 6) ఉద్యమంలో సహకరించిన వారు ఇప్పుడు రాజకీయంగా సహకరిస్తున్నారా లేదా?.
కచ్చితంగా సహకరిస్తారని నమ్మకం ఉంది. సంవత్సరాలపాటు విద్యార్థి జేఏసీతోపాటు, రాజకీయ జేఏసీతో కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా మంచి సంబంధాలు ఉన్నాయి.
సిరి7) రాజకీయంగా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి,ఎంపీటీసీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.