ఘనంగా కళశాల ఊరేగింపు..

Grand Kalasala procession..

సదాశివపేట: మార్కండేయ జయంతి సందర్భంగా లోపలి కోటలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథ్ ఆధ్వర్యంలో లోపలి కోట హనుమాన్ మందిరం నుండి మార్కండేయ మందిరం వరకు మహిళలు సామూహిక కళశాల ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్కండేయ జయంతి సందర్భంగా కళాశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆ మార్కండేయుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ దేవుని కోరుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మునిపల్లి రామకృష్ణ, నాగారం నర్సింలు, గుణాల సత్యం, పోలసురేష్, మునిపల్లి మనోహర్, గజం సురేష్, నాగారం పెంటయ్య, పోల మనోహర్, వెంకటేశం, పద్మ గణేష్, విశ్వనాథం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.