మనోహరాబాద్[Manoharabad], జనవరి 26. సిరి న్యూస్.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల వ్యాప్తంగా వాడవాడలా అధికారులు, నాయకులు , యువకులు త్రివర్ణ పతాకాలు ఎగరవేస్తూ ఘనంగా గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సుభాష్ గౌడ్, మనోహరాబాద్ టోల్గేట్ వద్ద యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, మనోహరాబాద్ తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి లతోపాటు ఇతర శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, యువసేన సంఘాల వద్ద యువకులు జాతీయ జెండాలు ఎగరవేస్తూ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.