ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ
క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్..
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
పటాన్చెరు
పటాన్చెరు [patancheru] శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై, కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక హజరత్ సయ్యద్ నిజాముద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అఫ్జల్, పరమేష్ యాదవ్, వెంకటేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.