నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేసిన శ్రీధర్ రెడ్డి..
రామాయంపేట జనవరి 10.
రామయంపేట పట్టణంలో పాట ఆయా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకు గారి శ్రీధర్ రెడ్డి నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. రాయపూర్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి కార్యకర్తలు నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. రామయంపేటలో టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో హనుమంతరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా రామయంపేటలో కేక్ కట్ చేసి కార్యకర్తలతో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు తమకు తోచిన విధంగా నిరుపేదలకు పార్టీతో పాటు హనుమంతరావు సేవలు అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో