బిజెపి జిల్లా నాయకుడు శంకర్ గౌడ్
రామాయంపేట[ramayampet] జనవరి 24 (సిరి న్యూస్)
కాంగ్రెస్ ప్రభుత్వం[congress government] చేపట్టిన గ్రామసభలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చేపడుతున్నాయని బిజెపి పార్టీ జిల్లా నాయకుడు శంకర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలను హామీల పేరిట కాలయాపన చేసిందని అదే తప్పు, కాంగ్రెస్ పార్టీ నేడు అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీ ల పేరిట ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు. నేడు రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పేరిట నిర్వహించి గ్రామసభలు ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవని అన్నారు. కేవలం టూ తో మంత్రంగా మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారని, అరువైన వారి పేర్లు జాబితాలో లేకపోవడం వల్ల ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ విషయంలో ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను సైతం అధికారులు నమోదు చేసుకోవాలని దుస్థితినిలకు ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి అవలంబించి విధివిధానాలు అధికారులకు వివరించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.