సిరి న్యూస్ కొల్చారం..
కొల్చారం [kolcharam]మండల పరిధిలోని. కోనాపూర్. సీతారాం తండా
తుక్కాపూర్ వసురం తండా వెంకటాపూర్ గ్రామాలలో ప్రజా పాలన తూతూ మంత్రంగా కొనసాగాయి
కోనాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ మండల పార్టీ యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు. తుక్కాపూర్ లో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆంజనేయులు ప్రజా పాలన ఇందిరమ్మ కమిటీల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సమయం వృధా చేస్తుందని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుకున్న వారికి సానుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్న ప్రజా పాలన మాత్రం తూతూ మంత్రంగా కొనసాగిపోయింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రత్యేక అధికారి శ్వేత
వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన 2023 ఉపాధి హామీలు ఎవరైతే 20 రోజులు పని చేసిన వారికి బెనిఫిట్ ఇస్తామని ప్రభుత్వం అంటుంది. ఈ విషయంలో భూమిలేని నిరుపేద కుటుంబాలకు న్యాయం చేసేలా కోనాపూర్ గ్రామస్తుల తరఫున జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ప్రత్యేక అధికారి శ్వేతా కుమారికి మెమొరాండం సమర్పించినట్లు తెలిపారు.