వెల్దుర్తి[veldurti] జనవరి 21 సిరి న్యూస్ః
వెల్దుర్తి మండల వ్యాప్తంగా మంగళవారం రోజు ప్రారంభం ఐనా ప్రజా పాలనా గ్రామ సభలు. కొన్ని చోట్ల గ్రామ సభ అని తెలిసిన జనాలు ఎక్కువ గా రాలేదు.మరికొన్నిచోట్ల గ్రామ సభకు వచ్చిన వారి పేర్లు రాకపోవడంతో గ్రామస్తుల అధికారులపై తిరగబడ్డారు. వివరాలకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 26 నుండి అమలు చేసే ఆరు గ్యారెంటీలలో భాగంగా మంగళవారం వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్,కొప్పులపల్లి, చర్లపల్లి, యశ్వంతరావుపేట్, చెట్టుపల్లి, బండ పోసానిపల్లి, రామాయపల్లి, ఎద్దులపల్లి, గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. నాలుగు రకాల సంక్షేమ పథకాల మంజూరులో భాగంగా మండలంలోని చెట్టుపల్లి, బండపోసానుపల్లి, రామయ్య పల్లి, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ అధికారులు నాలుగు రకాల పథకాల లబ్ధిదారుల పేర్లు చదవడంతో గ్రామంలో ఇండ్లు ఉన్నవారికి మళ్లీ ఇండ్లు మరియు రేషన్ కార్డు కూడా ఉన్న వారికే వచ్చాయంటూ అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా మొత్తానికే భూమి లేని నిరుపేదలకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బండ పోసన్పల్లి గ్రామంలో రేషన్ కార్డులు నిరుపేదలకు రాలేవని ప్రజా పాలనలో 85 అప్లికేషన్లు పెడితే కేవలం 13 వచ్చాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు కూడా గుడిసె ఉన్న వాళ్లకు రాలేదని స్లాబు ఇల్లు ఉన్న వాళ్లకే మళ్లీ వచ్చాయంటూ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామంలో అధికారులు సర్వేను పకడ్బందీగా చేయలేరు అంటూ కొంతమంది గ్రామ యువకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ లో వందల సంఖ్య లో రేషన్ కార్డు కొరకు సంవత్సరా కాలం నుండి దరఖాస్తు చేస్తే కేవలం పంచాయతి కి కొన్ని మాత్రం రావటం విడ్డురం అని గ్రామస్తులు మండిపడ్డారు. ముందు గానే వచ్చిన వారి పేర్లు తెలిసినందువలన వారు ఎవరు కూడా గ్రామ సభకు రాలేరని అసలైన లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులు విఫలం అయ్యారని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ కార్యక్రమం లో మండల రెవిన్యూ అధికరి కృష్ణ ఏఎస్ఓ సందీప్ రెడ్డి రామయపల్లి పంచాయతీ సెక్రెటరీ బాలకృష్ణ, ఏవోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.