భగవంతుడి పై విశ్వాసంతో ముందుకు సాగాలి

Go ahead with faith in God
Go ahead with faith in God

సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
సిరి న్యూస్, గుమ్మడిదల[gummadidala]
భగవంతుడు పై విశ్వాసంతో ముందుకు సాగాలని సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో శ్రీ డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మంగారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి “భక్తుడు – భక్తి – భగవంతుడు” అనే సత్సంగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “భగవంతుడిపై ప్రేమా విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని అన్నారు. అప్పుడే నిజమైన భక్తుడు అవుతాడు” అని పేర్కొన్నారు. భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్, నాయకులు డాక్టర్ ఆనంద్, వాసుదేవ రెడ్డి, సూర్యనారాయణ, జయపాల్ రెడ్డి, కిరణ్, ఆశ్రమ నిర్వాహకులు యాదా కిషన్, భాషయ్య, శంకర్, రాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.