శ్రీ గురు పీఠం ట్రస్టు ద్వారా రిఫ్రిజిరేటర్ కుట్టు మిషన్ బహుకరణ

gift-of-refrigerator-sewing-machine-by-sri-guru-peetham-trust
gift-of-refrigerator-sewing-machine-by-sri-guru-peetham-trust

శ్రీ గురు పీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగొని శివకుమార్ గౌడ్
శివంపేట్[sivampeta] ఫిబ్రవరి 1( సిరి న్యూస్ )
శివంపేట్ మండలం గూడూరు గ్రామంలో శ్రీ గురు పీఠం ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ జిన్నారం పెద్దగొని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యున్నతమైన జన్మ, ఈ జన్మను అందరూ దైవ నామస్మరణ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలి. శ్రీ గురు పీఠంలో నిర్మిస్తున్న దత్తాత్రేయ సాయిబాబా గుడి పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో గుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీ గురు పీఠం బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గురు పీఠం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో భాగంగా శివంపేట్ గ్రామానికి చెందిన వంజరి కొండల్ కు రిఫ్రిజిరేటర్, ముదగళ్ల సబితా రాజుకు కుట్టుమిషన్ బహూకరించారు. ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సూర్య కుమార్ గౌడ్ రాజేందర్ రెడ్డి లిఖిత అంబిక శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు