-896 గ్రాముల స్వాధీనం..
పటాన్‌చెరు:గంజాయి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికిని క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదు..
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతోంది. తాజాగా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ గత కొంతకాలంగా ఇస్నాపూర్ కేంద్రంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు.. ఆదివారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ అధికారులు దాడి చేసి 860 గ్రాములు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.