ఏడుపాయలలో అన్నదాన కార్యక్రమం..

Food donation program in Edupayal..
Food donation program in Edupayal..

మెదక్ అయ్యప్పస్వామి భక్తసేవా సమాజం ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం
గత నాలుగు సంవత్సరాలుగా ఏడుపాయల దేవస్థానం లో మెదక్ అయ్యప్పస్వామి భక్తసేవా సమాజం ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం..

మెదక్ జిల్లా : ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవస్థానం లో మెదక్ అయ్యప్పస్వామి భక్తసేవా సమాజం ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి రాజు పంతులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఏడుపాయల లో మాఘ అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతికరమైన రోజు గా భావించి మాఘ స్నానానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. సంవత్సరం సంవత్సరంకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్న ప్రసాదం పంపిణీ కూడా పెంచుతున్నామన్నారు. ఇట్టి బ్రుహత్తర కార్యక్రమం కు అయ్యప్ప భక్త సమాజం ధన వస్తు శ్రమ రూపేణా సహాయం అందిస్తున్నారని వారిని వారి కుటుంబాలను అయ్యప్ప స్వామి ఆదిపరాశక్తి దుర్గా దేవి ఆశీస్సులు యెల్లవేలలా ఉండాలని మనసారా కోరుకుంటున్నా నని తెలిపారు.