సిరి న్యూస్ జనవరి 28 హత్నూర[Hathnoora]:
హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి బతుకుదెరువు కోసం వలస వచ్చిన భోగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. సొంత జిల్లా నెల్లూరుకు బోగయ్య మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి అంబులెన్స్ ఖర్చులకు ఆర్థికంగా లేకపోవడంతో సమాచారం అందుకున్న గమ్యం ఫౌండేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి ఐదు వేలు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరిగుంతం కృష్ణ మూడు వేల రూపాయలు నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఆర్థిక పరిస్థితుల్లో నగదు రూపంలో సహాయ సహకారాలు అందించిన సురేందర్ రెడ్డి కి వరిగుంతం కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.