బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
సంగారెడ్డి[sangareddy]:పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ [Reimbursement of Fees] బకాయిలను, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ [Reimbursement of Fees], స్కాలర్షిప్‌లు విడుదలచేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 20వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అదే కర్ణాటకలో 15 వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు, అధిక ధనిక రాష్ట్రమైన మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం రూ.5500 ఇవ్వడం సిగ్గుచేన్నారు. , కావున వెంటనే స్కాలర్‌షిఫ్‌లను రూ. 5500 నుంచి 20వేలకు పెంచాలన్నారు. గురుకులాల్లో ఏడాదిలో 48మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు.
వేల కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్లేఓవర్స్, వాకింగ్ ట్రాక్స్ కడుతున్నారు, ఎవడు డిమాండ్ చేయకుండా, హైదరాబాదులో మూసి సుందరీ కరణ మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్ ఉంటుంది కానీ కాలేజీ కోర్సులు చదివే 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు స్కాలర్షిప్లు బడ్జెట్ ఉండదా?, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి, పది నెలలు గడిచిన కూడా విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకుండా కమిషన్లు వచ్చే కాంట్రాక్టుల బిల్లు చెల్లింఛక పోవటంచాలా దారుణమన్నారు, కనీసం కొనసాగుతున్న స్కీములు కూడా బడ్జెట్ ఇవ్వడం లేదు, ఫీజులు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీ లెక్చలర్లకు జీతాలు చెల్లించడం లేదన్నారు. అద్దె భవనాల కిరాయిలు, చెల్లించడంలేదన్నారు.ఈ కార్యక్రమంలోప్రదీప్ గౌడ్,రాకేష్ శ్యామ్
విద్యార్థులు, పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు,తది తరులు పాల్గొన్నారు.