గజ్వేల్ [Ghazwal] (సిరి న్యూస్)ఫిబ్రవరి 07
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించా రు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు గజ్వేల్ సిఐ సైదా తెలిపారు.ఇద్దరు తీవ్రంగా గాయ పడటంతో…వారిని సమీపంలోని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు గోదావరిఖనికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.లింగం (48) ప్రణయ్ (24) గా గుర్తించారు. గోదావరిఖని నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు తెలిపారు.వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడం వల్ల ముందు సీట్లో ఉన్న ఇద్దరు స్పాట్ లోనే మరణించారని పోలీసులు తెలిపారు.సమాచారం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.