ప్రతి ఫోటో వీడియో గ్రాఫర్లకు కుటుంబ భరోసా తప్పనిసరి.

Family insurance is a must for every photo videographer
Family insurance is a must for every photo videographer

అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్.
జనవరి 29. (సిరి న్యూస్) సదాశివపేట.[sadashivapeta]
ప్రతి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లకు కుటుంబ భరోసా సభ్యత్వం తప్పనిసరి అని సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు  సూఫాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం నాడు సదాశివపేట పట్టణంలో అసోసిన్ అధ్యక్షుడు నాగుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధరల  పెరుగుదల కోసం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో  ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లలా పరిస్థితి గోరంగా ఉందని. అందుకు ఐక్యత లోపమే అన్నారు. అందుకోసం మనమందరం కలిసికట్టుగా ఓకే తాటిపై నడిచినప్పుడు అందరు ఆర్థికంగా ఎదుగుతారు అన్నారు. అందుకోసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరలు  పెంచుకోవాలన్నారు. జిల్లా లోని ఫోటోగ్రాఫర్ల సమస్యల కోసం జిల్లాలో పర్యటించడం జరుగుతుందన్నారు.  పర్యటన యొక్క ముఖ్య అజెండా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఫోటోగ్రాఫర్లకు ఐక్యత చేకూర్చటం గురించి,మండల స్థాయి, జిల్లా స్థాయి సంఘాల గురించి అవగాహన వాటి యొక్క ప్రాముఖ్యత. కుటుంబ భరోసా కోసం మీకు అవగాహన మరియు దాని ప్రాముఖ్యత. జిల్లా బాడీ పూర్తి కూర్పు గురించి మండలాల నుండి సభ్యుల సేకరణ నిర్ణయం గురించి. జిల్లా సభ్యత్వం, మండల సభ్యత్వం, రాష్ట్ర సభ్యత్వం తో ఫోటోగ్రాఫర్ కి చేకూరే ప్రయోజనం. జిల్లాస్థాయిలో ఒకే ధరల పట్టిక మరియు ఐడి కార్డ్ కోసం. జిల్లా నుండి రాష్ట్రానికి ఇద్దరు సభ్యులను పంపడం కోసం మీ ఆసక్తిని బట్టి నిర్ణయించడం. మీ అందరి అభిప్రాయం మేరకు జిల్లా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తే బాగుంటుంది.ఇకనుంచి ఏ పోస్ట్ కు తగ్గ ఆ బాధ్యత నిర్వహించాల్సింది ఆ పోస్ట్ కు స్వీకరించిన వ్యక్తులదే. కుటుంబ భరోసా కు సంబంధించి జిల్లా ప్రతినిధిని ఎన్నుకోవడం గురించి ఇప్పటివరకు జిల్లాకు ఏ మండలాలు గానీ, ఏ పట్టణాలు గానీ, సభ్యులు గాని, ఎలాంటి రుసుము గాని, చెల్లించలేదు. కావున జిల్లా మనుగడ సాధ్యం కాదు. కాబట్టి జిల్లా సభ్యత్వ నమోదు మరియు మండలాల నుండి నెలకు కొంత అమౌంట్ గురించి.పై విధమైన నిర్ణయాలను మీ అందరి సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి జిల్లా పర్యటన చేయడం జరుగుతుందన్నారు. అనంతరం  ఫోటో వీడియో గ్రాఫర్  సంగం  ఆధ్వర్యంలో శాలువాతో జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు  శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ అధ్యక్ష కార్యదర్శులు కరణం నాగేశ్వరరావు,అనిల్ గౌడ్, గౌరవ అధ్యక్షులు బిట్ల రాజు, ప్రధానకార్యదర్శిజయచింతన్, జై చరణ్,శ్రీనివాస్, నరేష్, వీరేశం,అశోక్, సంగమేశ్, కృష్ణ,రాజు తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.