కొడకాంచి జాతరకు సర్వం సిద్ధం

everything-is-ready-for-the-kodakanchi-fair
everything-is-ready-for-the-kodakanchi-fair

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆదినారాయణ స్వామి
వెయ్యిండ్ల చరిత్ర ఆదినారాయణ స్వామి ఆలయం
స్వయంభుగా వెలసిన ఆదినారాయణ స్వామి
జిన్నారం మండలలోని కొడకాంచి గ్రామ శివారులో శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఆలయంలో పది రోజులపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఫౌండర్ చైర్మన్ అల్లాని రామోజీరావు తెలిపారు స్వయంభుగా కొలువుదిరారు శ్రీదేవి భూదేవి ఆదినారాయణ స్వామి క్షేత్రంగా పిలుస్తారు మాఘమా అమావాస్య పురస్కరించుకొని ఈనెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు ప్రతి ఏట ఫిబ్రవరిలో ప్రారంభమై పది రోజులపాటు జరిపే బ్రహ్మోత్సవాల్లో భక్తులు గుండంలో పుణ్యాస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు స్వామి వారి ఆలయానికి వెయ్యిళ్ల చరిత్ర ఉంది ఆలయ పునర్నిర్మాణం తర్వాత దినదిన అభివృద్ధి చెందుతున్నది ప్రకృతి వాతావరణంలో స్వయంభుగా వెలసిన ఆదినారాయణ స్వామి ఆలయంలో బంగారు వెండి బల్లులు దర్శనం ఇస్తాయి వీటిని స్పర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం కంచికి పోకపోయినా కొడకంచి కి వెళ్లాలని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఫౌండర్ ట్రస్ట్రీ అల్లాని రామోజీరావు తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
బ్రహ్మోత్సవ వివరాలు
1 2 తేదీల్లో అధ్యయనోత్సవాలు పల్లకి సేవ
3న పుట్ట బంగారు సేవ అగ్ని ప్రతిష్ట
4న శ్రీవారి ధ్వజ రోహణం బేరి పూజ రాత్రి ఆదినారాయణ స్వామి కళ్యాణోత్సవం అశ్వవాహన సేవ
5న హోమం బలిహరణం అమ్మవారి విమాన సేవ స్వామి వారి అలకసేవ
6న హోమం గరుడ ప్రతిష్ట గరుడ వాహన సేవ
7న హోమం బలి హరణం విమాన సేవ స్వామివారి అలకసేవ
8న మధ్యాహ్నం స్వామి వారి దివ్య రథోత్సవం ఊరేగింపు జాతర
9న తోపు సేవ హోమం ధ్వజ పట ఉద్వాసన పుష్ప యాగం స్వామి వారి ఏకాంత సేవ
10న బ్రహ్మోత్సవాల ముగింపు ఉత్సవాలు