-అందుకే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
-ఈ పెంపుతో పేదలకు మెరుగైన వైద్యం
-సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి
సంగారెడ్డి:నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు పటోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మనూర్ మండల చెక్కులు 17, నారాయణఖేడ్ మండల చెక్కులు, 54 నిజాంపేట్ మండల చెక్కులు 20 ,కల్హేర్ మండల 10 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందాలని దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఉన్న పథకాన్ని 10 లక్షలకు పేదవానికి సహాయపడే విధంగా ఈ ఆరోగ్య శ్రీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. గతంలో ఈ బిఆర్ఎస్ నాయకులు హాస్పిటల్లో చేరకున్న సరే దొంగ ఆసుపత్రి పత్రాలను సృష్టించి లక్షల రూపాయలను దోచుకున్నారు. అలా జరగకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రతి ఆసుపత్రిలో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.