వందల టిప్పర్లతో రాత్రికి రాత్రే చెత్త తరలింపు
కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు అరెస్ట్
భారీగా మోహరించిన స్పెషల్ పోలీసులు
సిరి న్యూస్ /గుమ్మడిదల రూరల్[
గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి గ్రామపంచాయతీలోని ప్యారా నగర్ గ్రామంలో డంప్ యాడ్ ను ఏర్పాటు చేస్తున్నారు. డంప్ యాడ్ ఏర్పాటును గుమ్మడిదల మండల ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయము అందరికీ తెలిసినదే. ప్రధాన రహదారి పైన రాస్తారోకో చేసి డంప్ యాడ్ ఏర్పాటును విరమించుకోవాలంటూ గతంలో నిరసన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసినదే. అయినప్పటికీ గత ప్రభుత్వం హయాంలో డంప్ యాడ్ ఏర్పాట్లుకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతోనే భాగ్యనగరం నుండి వందల సంఖ్యలో చెత్త తో నిండిన జిహెచ్ఎంసి వాహనాలు మంగళవారం అర్ధరాత్రి డంప్ యాడ్ కు చేరుకున్నాయి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న విషయము ముందుగానే పోలీసులు గ్రహించి స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామాల ప్రజలు లిక్కిపడ్డారు. ఎలాంటి అల్లర్లు కాకుండా ముందస్తు అరెస్టు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు అరెస్టులు మరొకవైపు డంప్యాడ్ పనులు అర్ధరాత్రి చురుకుగా సాగుతున్నాయి. ఈ విషయంలో ప్యారా నగర్ నల్లవల్లి గ్రామాల ప్రజలు అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
నల్లవల్లిలో 144 సెక్షన్ విధింపు
నల్లవల్లి గ్రామంలో 144 సెక్షన్ విధించి పోలీసులు భారీగా మోహరించి ప్రధాన కూడలి గుండా ఎవరు తిరగకుండా కట్టడి చేశారు ఎవరైనా డంపు యాడ్ కు వ్యతిరేకంగా ముందుకు వస్తే వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు గ్రామాలలోని ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీ స్థాయిలో మొహరించారు
గుమ్మడిదల బస్టాండ్ వద్ద
మున్సిపాలిటీ గుమ్మడిదల లోని బస్టాండ్ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు ఏ రాజకీయ నాయకుడైన డ్రంపు యాడ్ గురించి ప్రస్తావన తీసుకొస్తే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు ఈ విషయం తెలియడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎవరైనా రోడ్డుపైకి పోవాలంటే భయపడుతున్నారు
మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వృధా
నల్లవల్లి పంచాయతీ పరిధిలోని పారానగర్ లో డంప్ యాడ్ ఏర్పాటును చేయవద్దు అంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు స్థానిక నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చి ఏర్పడే సమస్యలను వారికి వివరించారు అయినప్పటికీ అధికారులలో ఎలాంటి మార్పు రాకుండా డంప్ యాడ్ నిర్మాణమును చేపట్టుతున్నారు. ఈ డంపు యార్డ్ ఏర్పాటుతో ప్రజలలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. మున్సిపా
లిటీగా ఏర్పాటు జరిగిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు
గుమ్మడిదలలో ధర్నా రాస్తారోకో
మున్సిపాలిటీ గుమ్మడిదల లోని కానుకుంట చౌరస్తా వద్ద డంపు యాడ్ కు వ్యతిరేకంగా ధర్నా రాస్తారోకో ప్రజలు దిగారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు