ఝరాసంగం, (సిరి న్యూస్)
సంక్రాత్రి పండగ సందర్భంగా మండల పరిధిలోని జీర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ముగ్గుల, కైట్స్ (గాలిపటలు) పోటీలు అందరిని అలరించాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ప్రతి ఒక్కరు విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల ఆకృతుల తో అందంగా ముగ్గుల ను వేశారు. ముగ్గులలో విద్యార్థులు వేసిన రంగులు తో పాటు ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా పాఠశాల ఆవరణలో గాలి పాటలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు. గ్రామానికి చెందిన సి.హెచ్ అంబమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు సి.హెచ్ మహేష్ ముగ్గుల పోటీలో నెగ్గిన వారికి 500 రూపాయలను నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయలు విజయలక్ష్మి, మురళీమోహన్,శ్రీనివాస్, యాదయ్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.