డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్
ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా
సిద్దిపేట,[siddipet] జనవరి 16 (సిరి న్యూస్):
మల్లన్న సాగర్ [Mallanna Sagar] భూ నిర్వాసితులకు ఉపాధి హమి పథకం పనులు చూపించాలని,ఇందిరమ్మ అమృత భరొసా పధకాన్ని వర్తింప చేయాలని, అర్ అండ్ ప్యాకెజిని అమలు చేయాలని అన్ని గ్రామాలకు స్మశాన వాటికలు నిర్మించాలని డిమాండ్ చెస్తూ దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో గురువారం గజ్వేల్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అర్డిఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు భూ సేకరణ చట్టం 2013 చట్టం ప్రకారం అర్ అండ్ అర్ ప్యాకెజి అందని కుటుంబాలకు అందివ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు600 మందికి అర్ అండ్ ప్యాకేజీ అమలు చెయలేదన్నారు.దాదాపు 800 మంది ఒంటరి మహిళలకు అర్ అండ్ అర్ ప్యాకెజి అమలు చేయకుండా గత ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. 1000 మంది నిర్వాసితులకు ప్లాట్లను కేటాయుంచలేదని,400 మందికి ప్లాట్ లకు పొజిషన్ చూపించలేదన్నారు .మరో 400 ఎకరాలకు నష్టపరిహరం నేటికి అందించలేదన్నారు.. 18 సంవత్సరాలు నిండిన కొంత మంది వయోజనులకు సైతం అర్ అండ్ అర్ ప్యాకెజిని అమలుచేయలేదన్నారు.123 జిఓ ప్రకారం బలవంతంగా భూములు స్వాధీనం చెసుకున్నప్పటికి రైతులకు రుణమాపి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటె ఉద్యమాన్ని ఉధృతం చెస్తామని హెచ్చరించారు.ఎర్రవల్లి పంచాయతీ కార్యదర్శికి పనికోసం దరఖాస్తు..
ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా అనంతరం నిర్వాసిత కాలనీలో ని ఎర్రవల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామికి డిబిఎఫ్ అధ్వర్యంలో 91 మంది కూలీల సంతకాలతో పని కి దరఖాస్తు లు సమర్పించారు. జాబ్ కార్డు లు మా వద్ద మా పనులు ఎక్కడ…పనులు కల్పించాలని,ఇందిరమ్మ అమృత భరోసా పధకం కింది నిర్వాసితులకు 12 వేల ఆర్ధిక సహాయం అందించాలని,అర్ అండ్ ప్యాకేజి అమలు చెయాలని నినాదాలు చేశారు.