కలెక్టర్ రాహుల్ రాజ్
సిరి /న్యూస్/ఫిబ్రవరి 04
మంగళవారం మెదక్ రూరల్[medak rural]
మెదక్ మండల పరిధిలోని బాలానగర్ ఏరియా నందు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి సంబంధించి షెడ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ ఈ యూనిట్ పెట్టడం ద్వారా రైతుకు ఆర్థిక అభివృద్ధి చేకూరే
లాభనష్టాలను, వ్యాపార లావాదేవీలను స్వయంగా
బి వీణ మహిళా రైతును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి మొదటి దశలో ఉన్న షెడ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకుని యూనిట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.ఒక కోటి రూపాయల వ్యయంతో ఈ యూనిట్ ప్రారంభించాల్సి ఉండగా. ఇందులో లబ్ధిదారిన వాటా 10 లక్షల కాగా, బ్యాంకు రుణం 40 లక్షలు ఉంటుందని చెప్పారు. యూనిట్ సబ్సిడీ 50 లక్షల లభిస్తుంది అన్నారు. 500 గొర్రెలు లేదా మేకలు 35 పొట్టేళ్లు లేదా మేక పోతులతో కూడిన బ్రీడింగ్ ఫారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వారికి ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్’ ఎంటర్ప్రైన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించిందన్నారు.ఔత్సాహకులు. వీరు జీవాల (గొర్రెలు, మేకలు) పెంపకంలో అనుభవం
కలిగి ఉండాలన్నారు. త్వరితగతిన యూనిట్ ప్రారంభించి ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ వెంకటయ్య, డాక్టర్లు లక్ష్మణ్, వినోద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
Home జిల్లా వార్తలు జీవాల పెంపకంలో బ్రీడింగ్ ఫారానికి సంబంధించి ఉపాధి కల్పన లక్ష్యాలను మెరుగుపరుచుకోవాలి