నారాయణఖేడ్[narayankhed] ఫిబ్రవరి 4 (సిరి న్యూస్):
మండలంలోని తాజా మాజీ సర్పంచులను నారాయణఖేడ్ పోలీస్లు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి, తాజా మాజీ సర్పంచ్ మరియు బారాసా మండల పార్టీ అధ్యక్షులు కుమ్మరి పరమేశ్, రుద్రారం సర్పంచ్ ప్రభాకర్ నామ్ లిమిట్ సర్పంచ్ సత్తిపాల్ రెడ్డి, అభ్యంత, చాప్ట (కె )సర్పంచులను ముందస్తుగా అరెస్టు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తుర్కపల్లి, సర్పంచ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని లేని పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.