చెడు వ్యసనాలకు యువత గురికావొద్దు

చెడు వ్యసనాలకు యువత గురికావొద్దు

కళాజాత ద్వారా అవగాహన..

రామయంపేట జనవరి 17 (సిరి న్యూస్)

మెదక్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజాంపేట, నందగోకుల్ గ్రామాలలో పౌర సంబంధాల కళాజాత బృందం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురవుతు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.అదేవిదంగా గంజాయి మత్తులో చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న యువతరం మారాలని మరియు ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సారధికళాకారులచే మాట,పాటలతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యెల్ల సిద్ధులు: టీమ్ లీడర్ కారంగుల మాధవి శివోల్ల కృష్ణ,బిట్ల ఎల్లయ్య,సందుర్ల శేఖర్ జింక దేవదాస్.టెక్మాల్ విజయ లక్ష్మి,ఆస రామారావు,కమ్మరి నరసయ్య,తుమ్మల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.