నారాయణఖేడ్, జనవరి 7 సిరి న్యూస్
నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్ పేట, వెంకటేశ్వర గుడి నుండి ఆర్టిసి డిపో, డీఎస్పీ కార్యాలయం సమీపంవరకు చాంద్ ఖాన్ పల్లి, నుండి కంగ్టి రోడ్డు వరకు ఈ లింకు రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపన పనులు చేపట్టారు. ఈ లింకు రోడ్ల నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లింకురోడ్ల నిర్మాణ పనులను జిల్లా కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ లు మంగళవారం పరిశీలించారు. జెసిబి తో పనులు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. వారి వెంట కౌన్సిలర్ నర్సింలు, రామకృష్ణ, మాజీ ఎంపిటిసి పండరి రెడ్డి, నాయకులు నగేష్ , జ్ఞానేశ్వర్, రైతులు తదితరులు ఉన్నారు.