నారాయణఖేడ్[Narayankhed],జనవరి 24 (సీరి న్యూస్)
అంగన్వాడి కేంద్రం భవనం, పై పెచ్చులు ఊడి గాయపడిన అంగన్వాడి చిన్నారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం పరామర్శించారు.
నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి కేంద్రం నిర్వహించే భవనం పై కప్పు పెచ్చులూడి పడడంతో అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న ఐదుగురు చిన్నారులు గాయల పాలయ్యారు. వీరిని వెంటనే అధికారులు నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలిసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.చిన్నారులకు చిన్న గాయాలయ్యాయని వారికి మెరుగైన చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ముగ్గురిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని, మిగతా ఇద్దరినీ అబ్జర్వేషన్ లో పెట్టి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి బాగుందని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యులైన వారిపై కఠించారు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.