వెల్దుర్తి,[veldurti] జనవరి 20 సిరి న్యూస్
వెల్దుర్తి మండలంలోని మన్నే వారు జలల్పూర్ గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ రంగీలతా కృష్ణ దంపతులు విద్యార్థులకు స్కూల్‌కు సంబంధించిన ఐడి కార్డులు, టై బెల్టులు అందజేశారు. విద్యార్థులకు ఇంకా ఏదైనా అవసరం ఉన్న వారి దృష్టికి తీసుకువస్తే ఎటువంటి సాయం అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాజీ సర్పంచ్ దంపతులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల ఎంఈఓ అరికల యాదగిరి కుక్కునూరు హెచ్వోడి సీతారాం మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.