సిరి న్యూస్ అందోల్ :(09-01-2025)
అందోల్ జోగిపేట[Andole jogipet] మున్సిపల్ పట్టణంలోని అందోల్ తహసిల్దార్ కార్యాలయంలో గురువారం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, తహసిల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసిల్దార్ మధుకర్ రెడ్డి, మండలం పార్టీ అధ్యక్షులు బి. శివరాజ్, మున్సిపల్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్, కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు నాని, కౌన్సిలర్ చందర్ నాయక్, కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ కుమార్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి , మాసంపల్లి సర్పంచ్ అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.