అక్రమంగా వేసిన డబ్బాలను తొలగించాలని మెదక్ రహదారిపై తిరుమలాపూర్ గ్రామస్తుల ధర్నా నిరసన

Dharna protest by villagers of Tirumalapur on Medak road to remove illegal bins
Dharna protest by villagers of Tirumalapur on Medak road to remove illegal bins

పెద్ద శంకరంపేట, (సిరి న్యూస్)
పెద్ద శంకరం పేట [pedda sankaram peta] జంట గ్రామమైన తిరుమలపూర్ గ్రామంలోకి వెల్లే సిసి రోడ్డు రహదారిపై మురికి కాలువలపై పలువురు అక్రమంగా వేసిన డబ్బాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుమలపూర్ గ్రామస్తులు పెద్ద శంకరంపేట మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా పలు వాహనాలు ఆగిపోయాయి. గతంలోనూ ఈ విషయం పై జిల్లా కలెక్టర్, డిపిఓ, మండల తహాసిల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ లలో అక్రమంగా వెలిసిన డబ్బాలను తొలగించాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. అయినా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెంది తాము రహదారిపై ధర్నా, చేపట్టి రాస్తారోకో, నిరసన, తెలిపామన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రాస్తారోకోను విరమింప చేశారు. అనంతరం తిరుమలపూర్ గ్రామస్తులు తహాసిల్దార్ కార్యాలయంలో అక్రమ డబ్బాలను తొలగించాలని మరోసారి వినతి పత్రం ఇచ్చారు.