మనోహరాబాద్,[manoharabad] జనవరి 21 సిరి న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధిక సంఖ్యలో పేదలు, నిరుపేదలు, సామాన్యులేనని అందుకోసం ఇటు ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు, దాతలు శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా, పాఠశాలకు అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా కృషి చేయాలని మెదక్ జిల్లా డీఈవో రాధా కిషన్ సూచించారు. మంగళవారం మండలంలోని కాల్ల కల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇటీవల ఈ పాఠశాలలో పై చదువుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలల ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలలో అత్యధికంగా మార్కులు పొందిన విద్యార్థులకు దాతలు బ్యాడ్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఈవో మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి రావడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, కాంప్లెక్స్ హెచ్ఎం నర్సింగ్గం, పాఠశాల హెచ్ఎం శ్రావణి లతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు ప్రభుత్వ పాఠశాలలకు అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చేటట్లు కృషి చేయాలి డీఈవో రాధాకృష్ణ