సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్ లో గల జ్యోతి రావు బాపులే బాలికల పాఠశాలలో రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ డెంటల్ క్లినిక్ సంయుక్తంగా శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ శిల్ప విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కే చందర్, పూసల లింగ గౌడ్. వనజా రెడ్డి. ప్రిన్సిపల్ రజిత పాల్గొన్నారు.