చేగుంట,[chegunta] జనవరి 20 సిరి న్యూస్
మెదక్ [medak] జిల్లా కొర్విపల్లి గ్రామానికి చెందిన రిటైర్ వెటర్నరీ డాక్టర్ వెంకట స్వామి గుండె పోటుతో కనుమూశారు. అతను తూప్రాన్, చేగుంట, చిన్న శంకరంపేట్, వెల్దుర్తి, మెదక్ మండలలో వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహించి ఎంతో మంది మన్ననలు పొందినారు. అతను అంటే మండలలో ని ఆయా గ్రామాలలో ప్రజలకు ఎంతో అభిమానం అని, జంతువులకు సేవ లందిచారని అతని మరణం జిర్ణించు కోలేనిది అని అతని జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా మదిలో ఉంటాయని మండల ప్రజలు తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుమారుడు సీనియర్ అసిస్టెంట్ గా శ్రీనివాస్ చేగుంట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.