ఫర్టిలైజర్ షాపులలో డిఏఓ తనిఖీలు

చిలిపిచేడ్ జనవరి 16 (సిరి న్యూస్) : మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలో గల ఫర్టిలైజర్ దుకాణాలలో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నకిలీ పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు అమ్మిన ఎడల తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని షాప్ యజమానులను హెచ్చరించారు. నిర్ణీత ధరలో అమ్మకాలు జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.