రామాయంపేట[Ramayampet] జనవరి 25 (సిరి న్యూస్)
రామయంపేట మండలం దామరచెరువు గ్రామంలో వాలీబాల్ పోటీలను శనివారం ప్రారంభించడం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పిట్ల నరేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏడు జట్ల సభ్యులు పేర్లు నమోదు చేసుకొని మొదటి రోజు పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం పిట్ల నరేష్ మాట్లాడుతూ నేటి సాంకేతిక సమాజంలో క్రీడలను మర్చిపోయి ప్రమాదం ఉందని, క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక విలాసం కలిగి ఆరోగ్యంగా ఉండడానికి ఈ క్రీడలు దోహదపడతాయని అన్నారు. గ్రామీణ క్రీడలు ప్రోత్సహించడానికి తన వంతు ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ పోటీల నిర్వహణ, విజయవంతం కోసం క్రీడాకారులు, యువకులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.