నారాయణఖేడ్[narayankhed] ఫిబ్రవరి 4 (సిరి న్యూస్)
సమయపాలన పాటించని అధికారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు లేబర్ ఆఫీస్ ముందు ధర్నా. ఈసందర్బంగా సిపిఐ నాయకులు ఆనంద్, చిరంజీవి, మాట్లాడుతూ.. ఖేడ్ లోని కార్మిక శాఖ కార్యాలయం సహాయ కార్మిక అధికారి గిరిరాజు, జూనియర్ అసిస్టెంట్ సాయులు, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదన్నారు.చుట్టపు చూపుగా మాత్రమే విధులకు హాజరవుతు వేతనాలు మాత్రం పూర్తిగా పొందుతున్నారన్నారు. వివిధ పథకాల లబ్దిదారులు వారికి రావాల్సిన పథకాల కోసం ఏడాది కాలంగా చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టు తిరుగుతున్న అధికారుల జాడ కనిపించడం లేదని నిరాశతో వెనువేరిగి వెళ్లిపోతున్నారు.కొత్త లేబర్ కార్డు కోసం వచ్చిన వారిని నీవు కూలి పనిచేవాడిలా లేవని, మహిళలకు లేబర్ కార్డ్ ఎందుకని ఇలా అనే కారణాలతో వారికి ఇబ్బందులకు చేస్తున్నారని వారు తెలిపారు. కొంతమంది వారి కుటుంబ సభ్యులు మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుల కోసం ఏడాది, 6 నెలలుగా తిరుగుతున్న అధికారులు కనికరించడం లేదన్నారు. 400 కార్డులు పెండింగులో ఉన్న అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సహాయ అధికారి ఎప్పుడు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పెండింగ్ పనుల నిమిత్తం వెళ్ళానని చెబుతున్న 400 కేసులు ఎందుకు పెండింగులో ఉన్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమ ధోరణి మార్చుకొని విధులకు సక్రమంగా హాజరు కావాలని లేని యెడల డీసీఎల్ మరియు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, పుప్పాల అశోక్, విజయ్, పాపయ్య, అశోక్ తదితరులు ఉన్నారు.