మునిసిపల్ కమిషనర్[Municipal Commissioner] : మధుసూదన్ రెడ్డి.Madhusudan Reddy]
ఐ డి ఏ బొల్లారం[IDA Bollaram], సిరి న్యూస్, ఫిబ్రవరి 7 :
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్సుల ఫీజులు సకాలంలో చెల్లించి బొల్లారం అభివృద్ధికి సహకరించవలసినదిగా మునిసిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్న మొండిబకాయలపై 2019 యాక్ట్ అనుసరించి స్థిర చర ఆస్తులను మునిసిపల్ చట్ట ప్రకారంగా జప్తు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి సకాలంలో పన్నులు చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు.