-మెదక్ జిల్లా ఎస్ టి యూ అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్.
పెద్ద శంకరంపేట, జనవరి 7 సిరి న్యూస్:
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ నిరంతరం కృషి చేస్తుందని మెదక్ జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోచయ్య లు అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు బి శ్రీనివాస్, మండల విద్యాధికారి వెంకటేశం చేతుల మీదుగా ఎస్ టి యు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీయూ సంఘం ఉద్యమాల ద్వారానే పోరాటాలు కొనసాగిస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు మండల అధ్యక్షులు నందయ్య గారి శ్రీనివాస్, బాధ్యులు రాధా కిషన్, కుమార్, అశోక్ రెడ్డి, ఆనంద్, వెంకట్, శేఖర్ గౌడ్, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.