జనవరి 23 ( సిరి న్యూస్ )
హత్నూర[Hatnoora]
సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హత్నూర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగ ప్రభు గౌడ్, ఆదేశాల మేరకు హత్నూర మండల్ బోర్పట్ల గ్రామంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కమలాకర్ మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015న తొలిసారి రాజ్యాంగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గౌరవార్థం పంచతీర్థల అభివృద్ధితో పటు పేదలు, అణగారిన వర్గాల,సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి.370 ఆర్టికల్ ద్వారా అంబేద్కర్ కలలు కన్న భారత అవన్నీ సాధించుకున్నాం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి తలారి మల్లేశం ఓబీసీ మోర్చా కార్యదర్శి సాయిరాం సీనియర్ నాయకులు వినోద్ కుమార్.