శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

Congress leaders visited Sri Renuka Ellamma Ammavari
Congress leaders visited Sri Renuka Ellamma Ammavari

చేగుంట[chegunta] జనవరి 31,సిరి న్యూస్
మాఘ అమావాస్య పురస్కరించుకొని చేగుంట మండల పరిదిలోని కర్ణాలపల్లి గ్రామం లో ఉన్నటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి,,శ్రీ రేణుక మత భవాని మాత అమ్మవారిని దర్శించుకున్నరు వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు, అనంతరం
ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువ కప్పి సత్కరించారు, ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మాసాయిపేట శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్, వెంగళరావు, బాలిరెడ్డి, మోహన్ నాయక్, ఆలయ కమిటీ అధ్యక్షులు రామా గౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.