మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపు…
మనోహరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన చిన్న శంకరంపేట మండలం కోరివిపల్లి గ్రామానికి వెళ్తుండగా మనోహరాబాద్ మండలం కాల్ల కల్ గ్రామ శివారులో ఆయనకు రాష్ట్ర నాయకుడు, మనోహరాబాద్ తాజా మాజీ సర్పంచ్ చిటుకుల మైపాల్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.
మనోహరాబాద్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్న మేడ్చల్, షామీర్ పేట పట్టణాలకు మైనంపల్లి హనుమంతరావు కృషి వల్ల సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ మంజూరు చేశారని ఇందుకోసం మైనంపల్లి హనుమంతరావును వారు అభినందించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మైనపల్లి హనుమంతరావు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాళ్లకల్ పట్టణ అధ్యక్షుడు కొత్త కాపు శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు లక్ష్మీ నరసింహ గౌడ్, శ్రీహరి గౌడ్, గణేష్ గౌడ్, మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్, గంట రాజు, రఘు, బక్క రమేష్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.