కార్పొరేటర్‌ను కలిసిన కాలనీ వాసులు

రామచంద్రపురం, జ‌న‌వ‌రి 16 సిరి న్యూస్ : రామచంద్ర రెడ్డి నగర్ కాలనీ లోని కార్పొరేటర్ నివాసంలో గురువారం ఓల్డ్ ఏం.ఐ.జి కాలనీ సంకల్ప గ్రౌండ్ సొసైటీ రెసిడెంట్స్ పలు అంశాల పై చర్చించి, బ్యాడ్మింటన్ షెడ్ నిర్మాణం కొరకు సహాయం చేసినందుకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే క్రిస్టియన్స్ అండ్ పాస్టర్ అసోసియేషన్ పటాన్చెరు నియోజకవర్గం రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ ప్రశాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్, జనరల్ సెక్రెటరీ జోసఫ్ మరియు సభ్యుల ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఏస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి . ఈ కార్యక్రంలో ఆర్.సి.పురం మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు .